Posted on 2026-04-27 22:00:34
డైలీ భారత్, హైదరాబాద్: నిరంతరం క్షేత్రస్థాయిలో విధులతో ఒత్తిడికి గురయ్యే పొలీసు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి ఉపశమనం కలగించేందుకు మనోధైర్యాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ బి. శివధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపేందుకు విలుగా సెలవులను ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి శనివారం అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
కఠినమైన విధులు నిర్వహిస్తూ, సమాజ రక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని, కనీస సంతోషాలను త్యాగం చేస్తున్న పోలిసుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బందిలో పని-వ్యక్తిగత జీవితం సమతుల్యతను పెంపొందించడంతో పాటు, వారి అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు డిజిపి వెల్లడించారు. కానిస్టేబుల్ స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు అందరికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే, ఈ సెలవు పొందగోరే వారు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ధృవీకరణ పత్రాలలో ముందుగానే రాతపూర్వక అభ్యర్ధనను సమర్పించాల్సి ఉంటుంది. శాంతిభద్రతల దృష్ట్యా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప, మిగిలిన సాధారణ సమయాల్లో సంబంధిత యూనిట్ అధికారులు సిబ్బంది అభ్యర్థనలను కాదనకుండా సెలవు మంజూరు చేయాలని డిజివి బి శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >