| Daily భారత్
Logo




మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2026-05-02 23:48:08

Share: Share


మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్.

డైలీ భారత్, వేములవాడ : మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మర్రిపల్లి ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పనుల్లో వేగం కూడా పెంచాలని అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసి రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా అందుతున్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా అనుసంధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం జరుగుతోందన్నారు...

మర్రిపల్లి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  మల్లారం, నాగయ్యపల్లి, పోచెట్టిపల్లి, కొనయపల్లి, కాశయ్యపల్లి, ఎదురు గట్ల, చెక్కపల్లి, అచ్చన్నపేట, వెంకటంపల్లి, బాలరాజపల్లి తదితర గ్రామాలకు ప్రత్యక్ష, పరోక్ష లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విప్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నంది మేడారం పంపుల ద్వారా నీటి సరఫరాను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

కలికోట సూరమ్మ ప్రాజెక్ట్, లచ్చపేట రిజర్వాయర్, ఎర్రచెరువు, పటేల్ చెరువుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేసి రైతులకు నీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మర్రిపల్లిలో రైతు వేదిక, గోదాముల నిర్మాణానికి భూమి కేటాయించి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రాధాభాయ్, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:38:05

Readmore >
Image 1

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On 2026-06-21 13:42:34

Readmore >