Posted on 2026-06-18 11:50:02
డైలీ భారత్, కామారెడ్డి : ప్రజలు వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై చుట్టు పక్కన గల ఖాళీ ప్రదేశాల్లో వేయొద్దని కామారెడ్డి 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత కోరారు. వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, పాత ఎన్ హెచ్ హైవే పక్కన గల ప్రాంతాల్లో గల ఖాళీ ప్రదేశాల్లో క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రారంభించారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్తాలు రోడ్లపై వేయొద్దని మున్సిపల్ చెత్త బండిలో వేయాలని 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ కాలుష్యం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇళ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని, తమ పరిసరాలు క్లిన్ అండ్ గ్రీన్ గా ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. వర్షకాలంలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ రాంమోహన్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హెచ్ సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఆర్ కే డిగ్రీ కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, మాజీ జడ్పీటిసి సభ్యులు పడిగేల రాజేశ్వర్ రావ్, డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజనర్సింహరెడ్డి, ప్రొఫెసర్ నాగరాజు, మడిపెద్ది వెంకట్, మహేందర్, గంజి సతీష్ గుప్తా, ఐకేపి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >