Posted on 2026-07-15 06:40:45
నిజాయితీకి 42 ట్రాన్స్ఫర్లైనా తగ్గని IPS రూపా దివాకర్
డైలీ భారత్, హైదరాబాద్/బెంగళూరు:"సివిల్ సర్వెంట్స్ నిజాయితీగా డ్యూటీ చేస్తే రాజకీయ నాయకుల అరాచకం సగానికి తగ్గిపోతుంది" - ఇది మాజీ సివిల్ సర్వెంట్స్ మాట. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం కర్ణాటక IPS అధికారి D. రూపా దివాకర్ మౌద్గిల్
రాజకీయ నాయకులకు "హడల్" పుట్టించే పేరు ఆమెది. CM లను కూడా కోర్టు ఆర్డర్ తో అరెస్ట్ చేసిన ధైర్యం, VVIP సంస్కృతిపై యుద్ధం, జైల్లో అవినీతిని బయటపెట్టడం... ఇవన్నీ ఆమె 20 ఏళ్ల కెరీర్ లోని కొన్ని అధ్యాయాలు మాత్రమే.
ఎవరీ రూపా?
1. *2000 బ్యాచ్ IPS ఆఫీసర్*. UPSC లో అఖిల భారత 43వ ర్యాంక్.
2. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో 5వ ర్యాంక్.
3. షార్ప్ షూటర్, భరతనాట్యం డ్యాన్సర్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ గ్రహీత.
4. తండ్రి రిటైర్డ్ ఇంజనీర్. భర్త కూడా IPS అధికారి.
"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్"
రూపా పేరు జాతీయ స్థాయిలో మారుమోగడానికి కారణం ఇదే.
మధ్యప్రదేశ్ CM ఉమా భారతి కేసు: హుబ్లీ అల్లర్ల కేసులో కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, అప్పటి MP CM ఉమా భారతిని ఆమె అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. VIP అని చూడకుండా చట్టాన్ని అమలు చేసినందుకు ఆమెకు "సూపర్ కాప్" అనే బిరుదు వచ్చింది. "నా కెరీర్ లోనే అత్యంత సులభమైన పని ఇదే" అని రూపా తర్వాత చెప్పారు.
మాజీ మంత్రి యడియూరప్ప, DSP పై కూడా చర్య
రెచ్చగొట్టే ప్రసంగంతో 3 ప్రభుత్వ వాహనాలు తగలబెట్టించిన కేసులో మాజీ మంత్రి యువగల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయమని స్థానిక పోలీసులకు ఆదేశించారు.
అప్పటి DSP రాజకీయ ఒత్తిడికి తలొగ్గి సహకరించకపోవడంతో, రూపా స్వయంగా రాత్రి 9 గంటల వరకు స్టేషన్ లో కూర్చుని నిందితుడిని పిలిపించారు. "మర్యాదగా రాకపోతే నేనే వస్తాను" అని వార్నింగ్ ఇవ్వడంతో మాజీ మంత్రి లొంగిపోయారు. డ్యూటీ చేయని DSP పై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో అతను సస్పెండ్ కూడా అయ్యారు.
VVIP సంస్కృతిపై బెంగళూరులో భూకంపం
బెంగళూరు DCP గా ఉన్నప్పుడు ఆమె చేసిన పని కర్ణాటక మొత్తాన్ని కుదిపేసింది.
1. 216 మంది అనవసర గన్మెన్లను వెనక్కి పిలిపించారు. "జనం సొమ్ముతో స్టేటస్ కోసం 5-6 గన్మెన్ ఎందుకు?" అని ప్రశ్నించారు.
2. అనుమతి లేకుండా మాజీ CM BS యడియూరప్ప కాన్వాయ్ లో వాడుతున్న పోలీస్ వాహనాలను కూడా వెనక్కి తీసుకున్నారు.
అధికారులు వారించినా లెక్క చేయలేదు. ఆమె పేరు చెబితేనే నాయకులు రెండు అడుగులు వెనక్కి వేసేవారు.
జైల్లో శశికళ VVIP ట్రీట్మెంట్ బండారం
2017లో జైళ్ల DG గా ఉన్నప్పుడు అతిపెద్ద సంచలనం సృష్టించారు.
AIADMK నేత శశికళ కు పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక వంటగది, VVIP సౌకర్యాలు ఇస్తున్నారని, దీనికి 2 కోట్ల రూపాయలు చేతులు మారాయని రిపోర్ట్ ఇచ్చారు. అందులో అప్పటి DGP సత్యనారాయణ రావు పేరును కూడా లాగారు.
మొదట్లో ఆమెపై అభాండాలు వేసినా, రిటైర్డ్ IAS వినయ్ కుమార్ కమిటీ విచారణలో రూపా ఆరోపణలన్నీ నిజమని తేలాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది.
నిజాయితీకి మూల్యం: 42 ట్రాన్స్ఫర్లు
20 ఏళ్ల సర్వీస్ లో దాదాపు *42 సార్లు ట్రాన్స్ఫర్*. ఎక్కడ నిజాయితీగా పని చేసినా ట్రాన్స్ఫర్ తప్పలేదు.
కొత్తగా ఏర్పడిన యాదగిరి జిల్లాకు SP గా వెళ్లినప్పుడు SP ఆఫీస్, క్వార్టర్స్ కూడా లేవు. భర్త క్వార్టర్స్ లో ఉంటూ, కూతురిని పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 ఏళ్లు చదివించారు. IPS అయినా "అందరి పిల్లలు సమానమే" అని పలక పట్టుకుని కూర్చోబెట్టారు.
రూపా మాటలో...
"బ్యూరోక్రాట్స్ తమకు తాము వేసుకున్న సంకెళ్లు తెంచుకుంటే కొత్త భారతం వస్తుంది. నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి చేయలేరు" అంటారు రూపా.
ఆమె లాంటి అధికారులు ఉంటేనే అవినీతి "కంపు" కొంతైనా తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వెబ్ డెస్క్
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >