| Daily భారత్
Logo




నేడు దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న ఇంద్రకీలాద్రి అమ్మవారు

Devotional

Posted on 2023-10-22 12:48:43

Share: Share


నేడు దుర్గాదేవిగా దర్శనమివ్వనున్న  ఇంద్రకీలాద్రి అమ్మవారు

డైలీ భారత్ , విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8 వరోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గా దేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిధి రోజున సంహారించింది. అందుకే దుర్గగా కీర్తించబడుతుంది.

నవరాత్రులలో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమీయడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాడ విశ్వాసం.

లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిధినాడు ఆవిర్బవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది.

"దుర్గే దుర్గతి నాశని" అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది

అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్టించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలికింద దుర్గమాసురుడు మహిషురుణ్ని తొక్కిపట్టి ఉంచుతూ దర్శనమిస్తుంది. ఈరోజు దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

దుర్గాష్టమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు పోయి సద్గతులు ప్రసాదించబడతాయని భక్తుల విశ్వాసం

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >