Posted on 2023-10-24 18:35:36
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా:త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా BSF రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది.సోమవారం రోజున జిల్లా కేంద్రంలో 100 మంది జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి, 200 మంది కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించి వారితో పాటుగా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ,అంబేద్కర్, గోపాల్ నగర్ చౌరస్తాల మీదుగా బీ.వై నగర్, సంజీవయ్య నగర్,వెంకంపెట్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగిన కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్, మాట్లాడుతూ,..
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని,ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు.జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో మొత్తం 560 పోలింగ్ స్టేషన్స్ ఉండగా,ఇందులో 118 క్రిటికల్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది అన్నారు.ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిలే ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలి.
పాత నేరస్తులను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బైండోవర్ చేస్తున్నామని అన్నారు.,జిల్లా పరిధిలోని అవసరమైన ప్రదేశాల్లో 05 చెక్ పోస్టులతో పాటుగా డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అక్రమ నగదు తరలింపు వంటి నేరాలను అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నమని, సరైన పత్రాలు లేకుండా నగదు తదితర వస్తువులు తీసుకెళితే సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో BSF కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ ఉపేందర్, ఆర్.ఐ యాదగిరి, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, BSF సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >