| Daily భారత్
Logo




రైతు రుణమాఫీ అంటూ లింకులు వస్తే ఓపెన్ చేయకండి : ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి

News

Posted on 2024-07-18 22:34:22

Share: Share


రైతు రుణమాఫీ అంటూ  లింకులు వస్తే ఓపెన్ చేయకండి : ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి

సైబర్ నేరగాళ్ళు ఉన్నారు జాగ్రత్త

రైతు రుణమాఫీ అంటూ  లింకులు వస్తే ఓపెన్ చేయకండి.

సైబర్ నేరగాళ్ళ మోసానికి గురైతే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయండి  

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి

డెలి భారత్ మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం మొదలు పెట్టగానే సైబర్ నేరగాళ్లు మోసాలు చేయటం కోసం అట్టి కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా మోసం చేయటం అధిక మవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలియజేశారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం నేపథ్యంలో ఇదే అదునుగా కొందరు సైబర్ నేరస్థులు ఎదో ఒక బ్యాంకు పేరిట, వాట్స్ యాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు బ్యాంక్ పిక్చర్  లోగో తో వాట్స్ యాప్ లో APK files  పంపిస్తున్నారు.  ఈ లింక్ ని మనము ఓపెన్  చేస్తే లేదా ఇంస్టాల్ చేస్తే  మన వాట్స్ యాప్ మరియు మన ఫోన్  వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుంది,  అంతే కాకుండా మనకు వచ్చే మెసేజ్ లు  మరియు OTP లు అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి  వెళ్ళటం జరుగుతుందని  దీని ద్వారా సైబర్ నేరస్థులు మన Google Pay / Phone Pay మరియు UPI ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.  ట్రేండింగ్ లో వున్న టాపిక్ ద్వారా APK Files పంపి డబ్బులు కొట్టేస్తున్నారు.  కాబట్టి అందరికి మనవి చేసేది ఏమంటే ఏదయినా గుర్తించదగని apk files వచ్చిన లేదా తెలియని లింకులు వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో క్లిక్ కానీ ఇన్స్టాల్ కానీ చెయ్యకూడదు.  ఎవరైనా ఏదయినా సైబర్ నేరానికి గురి అయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా 1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చెయ్యండి. ఎవరైనా సైబర్ నేరానికి గురి అయినట్లయితే వీలైనంత తొందరగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయడం ద్వారా మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >