Posted on 2025-12-16 19:47:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన లలిత కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం వినూత్నంగా తమ కాంప్లెక్స్ ఎదుట ప్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసనక తెలిపారు. ఫ్లెక్సీలో సారాంశం ప్రకారం గత ఎనిమిది నెలల క్రితం జెసిపి ద్వారా తమ కాంప్లెక్స్ ఎదుట పగలగొట్టి వెళ్లారని అది ఇప్పటివరకు పూడ్చకుండా పాలకులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మురికి కాలువ పక్కనుండి నిజామాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక కార్పొరేటర్లు పలుసార్లు పర్యటించినప్పటికీ తమ సమస్యకు వారు పరిష్కారం చూపడం లేదని ఆందోళనతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద కలకలం సృష్టిస్తుంది. తమ కాంప్లెక్స్ ఎదుట గల మురికి కాలువను సరిచేయమని లలితా కాంప్లెక్స్ షాప్ రెంటర్స్ అందరూ కలిసి గతంలో ఇదివరకు మున్సిపాలిటీ సిబ్బందికి అధికారులకు ఫిర్యాదు చేశామని, దీనికి తోడు జిల్లా కలెక్టర్ కు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని అక్కడి నుండి కూడా ఎలాంటి స్పందన రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. గత 8 నెలల క్రితం మున్సిపాలిటీ అధికారులు జెసిపి ద్వారా పగలగొట్టి వెళ్లిన మురికి కాలువ ద్వారా దానికి మరమ్మతులు చేయకపోవడంతో దీని ద్వారా ఏర్పడిన దుర్వాసన, దోమల ద్వారా తమ కాంప్లెక్స్ లోని వాళ్లందరూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని దీని ద్వారా తీవ్రంగా నష్టపోవడం జరిగిందని వారు ఈ ఫ్లెక్సీ ద్వారా నిరసన ఆందోళన వ్యక్తం చేశారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >