| Daily భారత్
Logo




అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

News

Posted on 2026-04-28 07:33:42

Share: Share


అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

అడుగులు ఆగకూడదు...

పల్లె జాతరల్లో మోగే డప్పు శబ్దం

మొదలైతే…

పిల్లలు, పెద్దలు అందరూ చేరి

చూసేది ఒకటే — నృత్యం…

అది మన విలువల జీవిత కథ..!

చెప్పుల్లేని కాళ్లు

మట్టి నేలపై పడే ప్రతి అడుగు

కేవలం నాట్యం కాదు…

ఒక మన జీవితం కథ..!


కూచిపూడి అడుగు వేస్తే

పురాణం మాట్లాడుతుంది…

భరతనాట్యం తిరిగితే

దేవాలయం శ్వాస తీసుకుంటుంది..!

జానపద నాట్యం మొదలైతే

పల్లె గుండె కొట్టుకుంటుంది..!


కానీ…ఇప్పుడా డప్పు శబ్దం మెల్లగా తగ్గుతోంది…

చప్పట్లు మెల్లగా మాయమవుతున్నాయి..!

వేదిక మీద నర్తించే చేతులు

ఇంట్లో ఖాళీ పాత్రలు పట్టుకుంటున్నాయి..!


చప్పట్ల కోసం ఎదురు చూసిన కళ్లలో

ఇప్పుడు జీవన పోరాటం కనిపిస్తోంది..!

ఒక కళ కనుమరుగైతే

ఒక సంస్కృతి మసకబారుతుంది..!


పొట్ట కోసం...

కళను పక్కన పెట్టే రోజు వస్తే

అది ఒక మనిషి ఓటమి కాదు…

మన సంస్కృతి ఓటమి అవుతుంది..!

ఒక నర్తకి కన్నీరు కారిస్తే

ఒక జాతి ఏడుస్తోంది..!


వారి కాళ్లు ఆగిపోతే

మన కథ ఆగిపోతుంది అని గుర్తుంచుకో..!

వారి కళ మసకబారితే

మన మూలాలు మసకబారుతాయి

అని గుర్తుంచుకో..!


అందుకే…

మనం కూడా ముందుకు వచ్చి

వారి అడుగులకు చప్పట్లు కొట్టాలి..!

వారి కష్టాలకు వెలుగు ఇవ్వాలి

బావి తరాలకు ఈ కళను

కానుకగా అందించాలి..!


వేదిక దూరంగా అనిపించినా

మన హృదయం దగ్గరగా ఉండాలి..!

పల్లెలో మళ్లీ

డప్పు శబ్దం మోగాలి..!


మంజుల పత్తిపాటి కలం నుండి

జాలువారే ప్రతి కవిత

బావి తరాల కోసమే…

లయ ఆగకుండా ఉండాలని,

నృత్యం నిలిచేలా ఉండాలని

పదాలు నాట్యం చేస్తున్నాయి..!


ఒక అక్షరం లయ అయి

మరో అక్షరం తాళమయి

మంజుల కలం కదిలితే...

కాగితం మీద అడుగులు నాట్యం చేస్తున్నాయి..!


నృత్య కళాకారులు రాను రాను సరైన ఆదరణ లేక 

కనుమరుగై పోతున్నారు.ఇంకా కొంతమంది ఆదరణ లేక పోయినా కళా వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వారి ఆలన పాలన చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలదే...

మనం కూడా వారిని ప్రోత్సహించాలని 

బావి తరాలకు కానుకగా అందించాలని కోరుకుంటూ 

నృత్యంగా ప్రతి కళాకారుడికి (ఏప్రిల్  ఇరవై తొమ్మిది)

ప్రపంచ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు.


రచన : మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >