| Daily భారత్
Logo




బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

News

Posted on 2026-04-28 07:58:08

Share: Share


బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

బైక్ తాళం విషయంలో మొదలైన గొడవ విషాదాంతం

రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు

నిందితులు గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డైలీ భారత్, తాడిపత్రి : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి పట్టణంలోని బంకమట్టి కాలనీకి చెందిన దూదేకుల అబ్దుల్లా, గౌస్, కార్తీక్‌లు స్నేహితులు. ఆదివారం రాత్రి అబ్దుల్లాకు చెందిన బైక్ తాళాన్ని స్నేహితులు కింద పడేశారు. ఈ విషయమై వారి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన గౌస్, కార్తీక్‌లు.. పక్కనే ఉన్న పదునైన నాపరాళ్లతో అబ్దుల్లా తల, ఇతర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అబ్దుల్లా, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన గౌస్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో బంకమట్టి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి

Image 1

నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర

Posted On 2026-06-22 18:54:32

Readmore >
Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >