| Daily భారత్
Logo




సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

News

Posted on 2026-04-28 23:09:39

Share: Share


సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

డైలీ భారత్ డెస్క్: సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు.. డబ్బుల విత్అకు డెత్ సర్టిఫికెట్ అడగడంతో..ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. నిబంధనల పేరుతో బ్యాంకులు సామాన్యులను ఎంతటి వేదనకు గురిచేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.కియోంజర్ జిల్లా డియానాలి గ్రామానికి చెందిన జితు ముండా అనే వ్యక్తి, తన సోదరి కాక్రా ముండా అకౌంట్లో ఉన్న రూ. 19,300 డ్రా చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డాడు. కాక్రా ముండా రెండు నెలల క్రితమే మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకుముందే మరణించడంతో, జితు ఒక్కడే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధువు. తన సోదరి అంత్యక్రియలు, ఇతర ఖర్చుల కోసం ఆ డబ్బు అవసరమవ్వడంతో అతను ఒడిశా గ్రామీణ్ బ్యాంక్ను ఆశ్రయించాడు.అయితే, బ్యాంకు మేనేజర్ నిబంధనల పేరుతో డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. ఖాతాదారు స్వయంగా రావాలని లేదా వారసుడిగా ధృవీకరించే చట్టపరమైన పత్రాలు సమర్పించాలని ఖరాకండిగా చెప్పారు. చదువుకోని గిరిజనుడైన జితు వద్ద మరణ ధృవీకరణ పత్రం  గానీ, వారసత్వ పత్రాలు గానీ లేవు. ఆ క్లిష్టమైన ప్రక్రియ అర్థం కాక నిస్సహాయ స్థితిలో వెనుతిరిగిన జితు, సోమవారం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్మశానానికి వెళ్లి తన సోదరి అస్థిపంజరాన్ని తవ్వి తీసి, దానిని ఒక గుడ్డలో చుట్టి భుజాన వేసుకుని, మండుటెండలో 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు.బ్యాంకు వద్ద ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు నివ్వేరపోయారు. నిబంధనల కంటే మానవత్వం ముఖ్యం కాదా అని బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సర్పంచ్ ద్వారా ధృవీకరించుకోవడమో లేదా క్షేత్రస్థాయి పరిశీలన చేయడమో చేయకుండా, ఒక పేదవాడిని ఇలా ఇబ్బంది పెట్టడంపై నిరసన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జితును ఓదార్చారు. ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని, బ్యాంకు నుండి వివరణ కోరుతామని పోలీసులు హామీ ఇచ్చారు.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >