| Daily భారత్
Logo




లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్

News

Posted on 2026-05-15 19:39:23

Share: Share


లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్

నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాల స్వాధీనం

జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరంగా దాడులు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు మరియు నగదు రూ.2,590 స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మానగర్ కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్వహించిన దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,350 నగదు మరియు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ జూదం అనే వ్యసనానికి బానిసైతే వ్యక్తులు అప్పుల పాలై, కుటుంబాల్లో ఆర్థిక మరియు మానసిక సమస్యలు తలెత్తి, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. జూదం కుటుంబాల్లో అశాంతిని కలిగిస్తుందని, యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జూదం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >