| Daily భారత్
Logo




బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

News

Posted on 2026-06-15 16:17:49

Share: Share


బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

తరుణి స్వచ్ఛంద సంస్థ తో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఒఝా, తరుణీ ఫౌండర్స్ మమతా రఘువీర్, రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాల్య వివాహం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని, అది బాలికల భవిష్యత్తును ప్రభావితం చేసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. బాల్య వివాహాల కారణంగా బాలికల విద్య మధ్యలోనే ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆర్థిక స్వావలంబన దెబ్బతినడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. బాల్య వివాహం-బతుకు ఆగం అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా కేంద్రంగా ఈ ప్రచారం మరింత విస్తృతంగా జరగాలన్నారు.

తెలంగాణలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఇప్పుడు తరుణి వంటి అనుభవజ్ఞ సంస్థ సహకారంతో ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ ఒప్పందం ద్వారా అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సీడీపీవోలు, ఇతర శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచార కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మైనర్ గర్భధారణల ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి, “ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించడం మనందరి బాధ్యత. బాల్య వివాహాలకు పూర్తిగా ముగింపు పలకడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.

తరుణి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మమతా రఘువీర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల తగ్గింపునకు సాంకేతిక సహకారం, అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >