Posted on 2026-06-15 09:51:53
పోలీసులపై ఎదురుకాల్పులు!
డైలీ భారత్, బాపట్ల: బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్పై అప్పికట్ల-మాచవరం మధ్య 2:30 సమయంలో దుండగులు దాడి చేశారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. బాధితులు కేకలు వేయడంతో చైన్ లాగి పరారయ్యారు. వీరిని అడ్డుకునేందుకు GRP పోలీసులు కాల్పులు జరపగా, దొంగలు కూడా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >