Posted on 2026-06-14 18:20:08
డైలీ భారత్, మహబూబాబాద్: తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ నెల్లికుదురు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు తొర్రూరుకు వచ్చిన ఆయన చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నవీన్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపారు. అక్కడికి వచ్చిన యువతకు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించి ఉంటే మృతుడు బ్రతికి ఉండేవాడు కదా అని అక్కడ ఉన్న స్థానికులను హెచ్చరించారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >