Posted on 2026-06-14 18:12:50
గర్భిణి కి సకాలంలో ఏ నెగిటివ్ రక్తం అందజేత
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గౌతమి (28) గర్భిణీకి ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని ఎల్లారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోష్కే నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 కోట్ల యూనిట్ల రక్తం ప్రపంచవ్యాప్తంగా రక్తదాతలు అందజేస్తున్నారని,ప్రతిరోజు 3 లక్షల 20వేల యూనిట్ల రక్తం అవసరం ఉన్నదని సకాలంలో రక్తం దొరకకపోవడంతో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని,తల సేమియా బాధిత చిన్నారులకు 15 రోజులకు వారి జీవితాంతం అవసరమవుతుందని, వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేరని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే రక్త దాతలు లేకపోతే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు ఎరగాలని అన్నారు. రెడ్ క్రాస్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.రక్తదాత గోష్కే నాగరాజుకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమయ ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >