Posted on 2026-06-14 13:07:39
డైలీ భారత్, స్పెషల్:
తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం...
గోవిందా గోవిందా నినాదాల గగనంలో
గిరులు కూడా తలవంచిన ఆ మహా సన్నిధిలో
శ్రీవారి కృపా కటాక్షం తాకిన వేళ...
జీవితమే కొత్త వెలుగుల దీపమై మారెను…!
మంజుల కలం నుంచి జారిన ప్రతి అక్షరం
పూల మాలలా మారి పాదాల వద్ద చేరెను
అవి భక్తి గీతాలై లోకమంతా విరిసెను
హృదయాలను తాకే అమృత ధారలై ప్రవహించెను..!
శ్రీనివాసా… నీ నామం పలికిన చోట
మాటలు మౌనమై ప్రార్థనగా మారిపోతాయి
దుఃఖం కూడా దారిచూపే దీపమవుతుంది
మనసు తననే తాను మరిచిపోయే క్షణమవుతుంది..!
అక్కడ వెలిగే దీపం నూనెతో కాదు
మనిషి లోపల కరిగే అహంతో వెలుగుతుంది..!
మంజుల కలం నుంచి వచ్చిన అక్షరాలు
అది అక్షరాలుగా కాదు—ఆర్తిగా ప్రవహిస్తుంది
ప్రతి పదం ఒక పుష్పమై పాదాల వద్ద వాలుతుంది
ప్రతి వాక్యం ఒక నిశ్శబ్ద ప్రదక్షిణగా తిరుగుతుంది..!
తిరుమల శిఖర సింహాసనంపై విరాజిల్లే స్వామీ
నీ పాదస్పర్శ లభిస్తే మా జన్మ ధన్యమవుతుంది..!
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >