Posted on 2026-06-15 06:56:34
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల కోసం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన కల్లం రాధిక, రాజారెడ్డి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
దాతలు సమర్పించిన విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వీకరించారు. అనంతరం దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు.
ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు అందించే విరాళాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
#Vemulawada #RajarajeshwaraSwamy #TempleDonation #RajannaTemple
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >