| Daily భారత్
Logo




మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

News

Posted on 2026-06-15 09:46:59

Share: Share


మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

నకిలీ పత్రాలు, రబ్బరు స్టాంపులు, కంప్యూటర్ పరికరాలు స్వాధీనం

డైలీ భారత్, మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారిక ముద్రలు, తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి భూమి రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన కేసులో మెట్‌పల్లి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు.

గత నెలలో అరపేట శివారులోని సర్వే నెం.191లో ఉన్న 8 గుంటల భూమికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం జారీ చేయని ఆబాది సర్టిఫికేట్‌ను నకిలీగా తయారు చేసి, తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు మెట్‌పల్లి తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసును జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మెట్‌పల్లి డీఎస్పీ పర్యవేక్షణలో, సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో మొత్తం ఆరుగురు నిందితులు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్ అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి మెట్‌పల్లి కోర్టులో గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, వివాదాస్పద భూమిని విక్రయించేందుకు నిందితులు పరస్పరం కుమ్మక్కై కుట్ర పన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఆబాది సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించడంతో, డాక్యుమెంట్ రైటర్ పాకాల రాకేష్ తన కంప్యూటర్‌లో నకిలీ ఆబాది సర్టిఫికేట్ రూపొందించాడు. అంగారి శంకర్ నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసి సహకరించగా, ఆ నకిలీ పత్రాల ఆధారంగా మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బెజ్జారపు మధుసూదన్ పేరుపై భూమి రిజిస్ట్రేషన్ జరిగినట్లు వెల్లడైంది.

ఈ వ్యవహారంలో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, బెజ్జారపు మధుసూదన్ ఆర్థిక లాభం పొందినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం.

ఈ సందర్భంగా మెట్‌పల్లి పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. భూముల కొనుగోలు సమయంలో సంబంధిత ప్రభుత్వ రికార్డులు, ధృవపత్రాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేయడం, నకిలీ ధృవపత్రాలు తయారు చేయడం, వాటిని వినియోగించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >