| Daily భారత్
Logo




సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలి : మంద బాబు

News

Posted on 2026-05-27 13:53:04

Share: Share


సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలి : మంద బాబు

పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నాం.. పదవులు మాత్రం వలస నేతలకేనా..?

దళిత బంధు లబ్ధిదారులకు పదవులు.. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు నిరాశ.

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని మరిచారా..?

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన సీనియర్ దళిత నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకుడు మంద బాబు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు ప్రస్తుతం పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తూ పదవులు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో తాము పార్టీ కోసం పస్తులు ఉండి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ కేసులు ఎదుర్కొన్నామని తెలిపారు. పార్టీ బీఫారం ఇచ్చిన అభ్యర్థుల గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన తమలాంటి నాయకులకు సరైన గౌరవం దక్కడం లేదని అన్నారు.

పార్టీ కోసం పని చేయని కొందరు నాయకులు పైస్థాయి నేతల అనుగ్రహంతో పదవులు పొందుతున్నారని ఆరోపించారు. వలస వచ్చిన నాయకులకు ఎస్సీ సెల్ పదవులు అప్పగిస్తూ సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులను అవమానపరుస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి నిజాయితీగా పనిచేసిన సీనియర్ దళిత నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >