Posted on 2026-05-30 17:52:53
డైలీ భారత్, విజయవాడ: మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జనరల్ బాడీ మీటింగ్–2026 శనివారం విజయవాడలోని హోటల్ కోసలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని ఫెడరేషన్ అధ్యక్షులు ఆనంద్ సాహు మరియు ఫౌండర్ & ప్రధాన కార్యదర్శి కుంభం రాంరెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు ఆనంద్ సాహు మాట్లాడుతూ, మోడర్న్ కబడ్డీ భవిష్యత్తులో గ్లోబల్ కబడ్డీగా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుమారు 20 సంవత్సరాల క్రితం టి-20 క్రికెట్ లేనప్పటికీ, నేడు ప్రపంచవ్యాప్తంగా టి-20 క్రికెట్ విశేష ప్రజాదరణ పొందినట్లే, మోడర్న్ కబడ్డీ కూడా రానున్న రోజుల్లో విశేష ఆదరణ పొందుతుందని తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడం ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఫౌండర్ & ప్రధాన కార్యదర్శి కుంభం రాంరెడ్డి మాట్లాడుతూ, మోడర్న్ కబడ్డీని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలోకి తీసుకెళ్లి యువతకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఫెడరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు, ఉత్తమ క్రీడాకారులు మరియు క్రీడాభిమానులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రాజు, జాయింట్ సెక్రటరీ వంశీ , తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరే తిరుపతి , రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జనరల్ బాడీ మీటింగ్ మే 30 మరియు 31 తేదీలలో కొనసాగనుంది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >