| Daily భారత్
Logo




అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

News

Posted on 2026-05-30 17:58:19

Share: Share


అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్: 

అమ్మ చరణధూళి బిడ్డలం....

నీ పాద ధూళి పుప్పొడి రేణువులం మేము..!

నీ కరుణామృత సింధు తరంగములం మేము..!

నీ కరస్పర్శ సౌభాగ్యమున సవరం చేసి... 

మలిన చిత్తాంబుజమున మణిదీపమై వెలుగు తల్లి..!

దేహమే దేవాలయమని వేదం గానమాడగా...

దేహాన్నే భారమని భావించి తిరుగుతున్నాం..!

అంతరాలయంలో కొలువైన దేవుణ్ణి మరచి... 

అలంకారాల గర్భంలో ఆత్మను దాచుకున్నాం..!

ప్రేమయే పరమపదమని నీ పలుకులు పలికినా... పగలనే పూజించి ద్వేషాన్ని హృదయంలో నిలిపుకున్నాం..!

 కరుణయే కైలాసమని నీ చూపులు బోధించినా... కఠినత్వపు శిలలతో మనసును ముసుగు చేసుకున్నాం..!

నీ దయా జలధార ఒక చుక్క తాకగానే...

ఎండిన ఆశల నేలలో ఆనంద మొగ్గలు తొడిగెను..!

 నీ నామస్మరణ ఒకసారి పలికగానే...

అజ్ఞానాంధకార గుహలలో జ్ఞానసూర్యుడు ఉదయించెను..!

తల్లి...! నీ పాదసేవలో పర్యావరణ పరిరక్షణ పూజగా మారాలి..!

నీ ఆశీస్సులతో ఆరోగ్య జీవనం యోగంగా వికసించాలి..!

ప్రకృతి, ప్రాణం, పరమాత్మ — ఈ త్రివేణి సంగమమే జీవన సార్థకత అని చెప్పిన మంజుల పత్తిపాటి కలం  భక్తి పుష్పాంజలి సమర్పించే.


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >