Posted on 2026-06-26 19:19:45
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన 12 ఏళ్ల ప్రకృతి బ్లెస్సి చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బ్లెస్సి... మూడు సంవత్సరాల వయసు నుంచే విత్తనాల సేకరణ, సీడ్ బాల్స్ తయారీ చేపట్టి అడవుల్లో వెదజల్లుతోంది.
తన తండ్రి, పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ ప్రోత్సాహంతో గత తొమ్మిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది.
తాజాగా గంభీరావుపేట పెద్దమ్మ అడవుల్లో అల్లనేరేడు, సీతాఫల్, చింత, పులిచింత, నేరేడు విత్తనాలతో పాటు సీడ్ బాల్స్‌ను వెదజల్లి అడవుల విస్తరణకు తన వంతు సహకారం అందించింది.
ఈ ఏడాది మాత్రమే దాదాపు పది వేల అల్లనేరేడు విత్తనాలు, సీడ్ బాల్స్‌ను అడవుల్లో చల్లినట్లు తెలిపింది.
గతంలో మానాల, శివగలపల్లి, లింగంపేట, రుద్రంగి, అలాగే జగిత్యాల జిల్లా కొండగట్టు అడవుల్లో కూడా విత్తనాలను వెదజల్లింది.
డ్రోన్ సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా సీడ్ బాల్స్ చల్లించినట్లు వెల్లడించింది.
అడవులు ఉంటేనే జీవం ఉంటుందని... చెట్లు లేకుంటే మనిషి మనుగడ అసాధ్యమని ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు ముందుకు రావాలని బ్లెస్సి కోరింది.
ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రకాష్, ఆవునూరు హరిణి, సుజాత, అనసూయ, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో పని చేస్తున్న బ్లేస్సి తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >