Posted on 2026-06-26 20:19:36
అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 94 ఏళ్ల ఆంధ్ర వృద్ధురాలు
భారత పౌరసత్వం తిరిగి పొందిన మహాలక్ష్మమ్మ
కలెక్టరేట్లో ప్రమాణం చేయించిన బాపట్ల కలెక్టర్
డైలీ భారత్, బాపట్ల: విదేశాల్లో దశాబ్దాలపాటు జీవించినా జన్మభూమిపై మమకారం వీడని ఓ 94 ఏళ్ల వృద్ధురాలి కోరిక నెరవేరింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపాల గ్రామానికి చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించి, తిరిగి భారత పౌరసత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆమెతో భారత పౌరసత్వ ప్రమాణం చేయించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
భర్త మరణానంతరం కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడిన మహాలక్ష్మమ్మ అక్కడ అమెరికా పౌరసత్వం పొందారు. అయితే జీవిత చరమాంకాన్ని సొంతగడ్డపైనే గడపాలని నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ను కలిసి, "నా చివరి రోజులు నా మాతృభూమిలోనే గడపాలని ఉంది. నేను మరణించిన తర్వాత నా అంత్యక్రియలు కూడా నా సొంత గ్రామంలోనే జరగాలి. అందుకే నాకు భారత పౌరసత్వం త్వరగా కల్పించండి" అంటూ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
ఆమె అభ్యర్థనపై నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తికావడంతో భారత పౌరసత్వం మంజూరైంది. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆమెతో భారత పౌరసత్వ ప్రమాణం చేయించి, అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా త్యజించి, మాతృభూమిలోనే చివరి శ్వాస విడవాలనే సంకల్పంతో భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన మహాలక్ష్మమ్మ నిర్ణయం పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. దేశం మారినా, జన్మభూమిపై ప్రేమ మారదని ఆమె మరోసారి చాటి చెప్పారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >