Posted on 2026-06-30 17:58:38
డైలీ భారత్, కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయంలో సుదీర్ఘకాలం పాటు విధులను నిబద్ధతతో నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఉషయ్యను మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ...
ఉషయ్య మున్సిపల్ శాఖ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన క్రమశిక్షణ, నిజాయితీ, సేవా తత్పరత ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, DE హన్మంతా రావు, AE వేణు ప్రసాద్, RO గోపాల్ రెడ్డి, అకౌంటెంట్ రాములు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉషయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా వీడ్కోలు పలికారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >