| Daily భారత్
Logo




వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

News

Posted on 2026-07-08 07:55:23

Share: Share


వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

జూలూరుపాడు మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తాళ్లూరి అచ్చయ్య

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా ఎన్నో సంవత్సరాలుగా జెండా మోస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు నేడు తగిన గౌరవం, గుర్తింపు, ప్రాధాన్యత లేకపోవడం అత్యంత బాధాకరం.

ఇటీవల పార్టీలో చేరిన వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్లను విస్మరించడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారిని పక్కన పెట్టడం సమంజసం కాదు.

ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పరిష్కారం కనిపించలేదు. సీనియర్ల సేవలకు తగిన గౌరవం ఇవ్వడం పార్టీ నైతిక బాధ్యత.అందువల్ల రాబోయే చైర్మన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పదవులు, కమిటీ నియామకాలు మరియు ఇతర రాజకీయ అవకాశాల్లోసీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నాను.పార్టీని బలపరచేది కేవలం కొత్త చేరికలు మాత్రమే కాదు; ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ కార్యకర్తల అంకితభావం కూడా అంతే ముఖ్యమైనది. వారి సేవలను గుర్తించడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం మరియు వైరా నియోజకవర్గ బాధ్యులు సానుకూలంగా పరిగణించి, సీనియర్ నాయకులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

సీనియర్లకు గౌరవం  కార్యకర్తలకు గుర్తింపు  కాంగ్రెస్ పార్టీకి మరింత బలం తాళ్లూరి అచ్చయ్య మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అన్నారు

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >