Posted on 2026-07-30 16:24:01
పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
డైలీ భారత్, వేములవాడ/సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి గురువారం పాల్గొన్నారు.
ముందుగా వేములవాడలో బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
అనంతరం సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.322.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రగుడు జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని మంత్రులు పేర్కొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >