| Daily భారత్
Logo




రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

News

Posted on 2026-08-11 16:27:51

Share: Share


రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

డైలీ భారత్, కామారెడ్డి: సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌ను ఎక్సైజ్, రైల్వే, టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉమ్మడిగా అడ్డుకున్నారు.

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 6 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాలతో ఈ దాడులు జరిగాయి.

ఈ తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డిటిఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, శరత్ కుమార్, అనిల్, మధు తో పాటు జాఫర్ షరీఫ్, అమృత రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, రమేష్, రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు.

రైళ్ల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా మరింత పెంచామని, ప్రయాణికులు అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >