Posted on 2026-08-11 13:57:25
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
కేసుల నమోదు, రికార్డుల నిర్వహణ, రికార్డుల నవీకరణ సక్రమంగా చేపట్టాలి.
పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డు గదులు, రైటర్ రూమ్‌లను పరిశీలించిన ఎస్పీ.
నేరాల నియంత్రణకు నిరంతరం గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశం.
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రతను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, రికార్డు గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించి, కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, చట్టపరమైన పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కేసుల నమోదు, దర్యాప్తు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డయల్-100 ద్వారా వచ్చే అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.
ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
ఈ తనిఖీలో బిక్కనూర్ సీఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >