Posted on 2026-08-11 03:21:45
డైలీ భారత్, రామంతపూర్:రామంతపూర్ బాగాయత్‌లోని వెంకట సాయి నగర్ కాలనీలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకట సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తొట్టెల ఊరేగింపును కాలనీలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. తొట్టెల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోత, మహిళల బోనాల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. బోనాల పండుగను ప్రతి సంవత్సరం కాలనీ ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కాలనీలో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి ,గౌరవ సభ్యులు రమేష్ గౌడ్, ఎం రవికుమార్ , గోపాల్ యాదవ్ , సర్వ సత్తయ్య యాదవ్, శివ శంకర్ , సంజీవ కమిటీ సభ్యులు ఆర్ గోవింద్, జి అశోక్, శ్రీనివాస్ గౌడ్ , కే నవీన్ కుమార్, భూపతి నరసింహ గౌడ్, డాక్టర్ విద్యాసాగర్, రామకృష్ణ, శివకుమార్ , బి.చలపతిరావు, రమేష్ శెట్టి, శ్రీధర్ గౌడ్, స్వామి, నరేష్, శ్రీనివాస్ రెడ్డి ,హరీష్ , శేఖర్, బి.రాములు గౌడ్, చంద్రం చారి ,పరుశురాం, ఐలేష్ యాదవ్, చారి, హుస్సేన్, బాల కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >