| Daily భారత్
Logo




వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

News

Posted on 2026-08-11 07:23:15

Share: Share


వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, పలు జాతీయ-అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం (IBRF) సభ్యుడు చిటికెన కిరణ్ కుమార్ సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప ప్రశంసించారు.

ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన “చెన్నపార్య శతకం” మరియు “చిత్సరూప శతకం” పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. చెన్నపార్య శతకం పుస్తకావిష్కరణ సందర్భంగా పత్రికలో చిటికెన కిరణ్ కుమార్ రచించిన వ్యాసం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు.

కథ, కవిత్వం, వ్యాసం, విమర్శ తదితర సాహిత్య విభాగాల్లో చిటికెన కిరణ్ కుమార్ నిర్విరామంగా రచనలు కొనసాగిస్తున్నారని, వేలాది రచనలు చేసి నూట యాభైకి పైగా పత్రికల్లో ప్రచురితమవడం విశేషమని పేర్కొన్నారు. ఇన్ని పత్రికల్లో నిరంతరంగా రచనలు ప్రచురితమవుతున్న రచయితలు చాలా అరుదని, ఆ ఘనత మన తెలంగాణకు చెందిన చిటికెన కిరణ్ కుమార్‌కు దక్కడం అభినందనీయమని ఆచార్య మసన చెన్నప్ప తన ప్రసంగంలో తెలిపారు.

సాహిత్యానికి అంకితభావంతో పనిచేస్తున్న చిటికెన కిరణ్ కుమార్  మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సభలో పాల్గొన్న పలువురు సాహితీవేత్తలు ఆకాంక్షించారు.

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >