Posted on 2026-08-01 07:45:01
బాలాపూర్ పోలీసులు, సామాజిక కార్యకర్త చాకచక్యం
డైలీ భారత్, హైదరాబాద్:పాతబస్తీలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం నాలుగు రోజుల ప్రాయం ఉన్న పసికందును రూ. 5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించిన శిశు విక్రయ ముఠా ఆటను బాలాపూర్ పోలీసులు, సామాజిక కార్యకర్త సఫియా మాహి అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు వహీదా ఖాతూన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులే లక్ష్యంగా వల:
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. చంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖాతూన్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగిస్తోంది. జూలై 28న మలక్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో గొల్కొండకు చెందిన ఆఫ్రీన్ అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేదరికంలో ఉన్న ఆమెను వహీదా ఖాతూన్ సంప్రదించి, పాపను విక్రయించాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. మొదట రూ. 6 లక్షలు ఆఫర్ చేసినా, చివరకు రూ. 5 లక్షలకు బేరం కుదిరింది.
ప్లాన్ మార్చినా దొరికిపోయారు:
ఈ శిశు విక్రయ లావాదేవీని మొదట షాహీన్ నగర్‌లో జరపాలని భావించారు. కానీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు చివరి నిమిషంలో స్థలాన్ని మార్చి, పహాడీషరీఫ్‌లోని జేజీఆర్ (JGR) ఫంక్షన్ హాల్ సమీపానికి చేరుకున్నారు. అయితే, ఈ అక్రమ విక్రయంపై సామాజిక కార్యకర్త సఫియా మాహి ద్వారా బాలాపూర్ పోలీసులకు ముందే పక్కా సమాచారం అందింది.
పోలీసుల మెరుపు దాడి – చిన్నారి సురక్షితం:
బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు పహాడీషరీఫ్ వద్ద రహస్యంగా ఉచ్చు పన్నారు. నిందితురాలు వహీదా ఖాతూన్ పసికందును చేతులు మారుస్తున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడి చేసి, ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల ఆ పసికందును సురక్షితంగా రక్షించి, సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నగరంలో ఇలాంటి శిశు విక్రయాలు జరుపుతున్న పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ఏమైనా ఉందా? ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో నిందితురాలిని విచారిస్తున్నారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >