Posted on 2026-08-01 14:10:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందించే సేవలకు సంబంధించిన రుసుముల పట్టికను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, వైద్యులు మరియు సిబ్బంది వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.
స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు సేవలు అందించే సమయంలో PCPNDT చట్టం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులే స్కానింగ్ నిర్వహించాలని, "ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు" అనే బోర్డును స్కానింగ్ గది, వేచియుండు హాలులో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫారం-ఎఫ్‌ను అదే రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు సంబంధిత పత్రాలను జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.
తనిఖీలలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు డయాగ్నస్టిక్ సెంటర్లను గుర్తించి, వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.
ఈ తనిఖీలలో సెక్షన్ ఇన్‌చార్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
#RajannaSircilla #Vemulawada #DMHO #DrAngelaAlfred #HealthDepartment #PrivateHospitals #DiagnosticCenters #PCPNDTAct #MedicalInspection #TelanganaNews
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >