Posted on 2026-08-01 16:59:26
డైలీ భారత్, సిరిసిల్ల: ఉద్యోగ ఉపాధ్యాయుల సుదీర్ఘ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతా నగర్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా TPTF కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుమాల రమానాద్ రెడ్డి, విక్కుర్తి అంజయ్య అధ్యక్షత వహించారు.
సమావేశంలో చేసిన ప్రధాన డిమాండ్లు:
G.O 25 ను వెంటనే రద్దు చేయాలి. ఈ జీవో వల్ల అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని, ప్రతి తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని అన్నారు.
PRC నివేదికను వెంటనే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్‌ను ఆలస్యం చేయడం సరికాదని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న 6 DA లను వెంటనే విడుదల చేయాలి.
CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం OPS ను అమలు చేయాలి.
EHS హెల్త్ కార్డుల అమలులో జాప్యం తగ్గించాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించి ఉద్యోగ ఉపాధ్యాయులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని కోరారు.
విద్యారంగంపై స్పందిస్తూ వర్క్ అడ్జస్ట్‌మెంట్ పేరుతో జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే శిక్షణల పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలల నుండి దూరం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం తగ్గుతుందని అన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖపై సమీక్షలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
అలాగే 190 G.O అమలు చేయాలని, 317 G.O బాధితులకు న్యాయం చేయాలని, BED అర్హత ఉన్న SGT లకు LFL మరియు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, మైలారం తిరుపతి, కృష్ణ చైతన్య, రామచంద్రం తో పాటు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >