| Daily భారత్
Logo




రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

News

Posted on 2026-08-08 14:28:17

Share: Share


రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

డైలీ భారత్, హైదరాబాద్:సోషల్ మీడియా వేదికగా ఒంటరి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ సాగుతున్న సరికొత్త "డేటింగ్ మోసం" కలకలం రేపుతోంది. "రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్" (Rent a Boyfriend) పేరుతో వస్తున్న ఆఫర్ల పట్ల యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం యువతులను బురిడీ కొట్టించి, డబ్బులు గుంజేందుకు సైబర్ కేటుగాళ్లు పన్నిన సరికొత్త వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. 

రూ.499 ఆఫర్ వెనుక అసలు నిజం ఇదే!

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లలో "ఒంటరిగా ఫీలవుతున్నారా? కాఫీ, సినిమా లేదా షాపింగ్‌కు తోడుగా రావడానికి అందమైన అబ్బాయిలు అద్దెకు దొరుకుతారు" అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. యువతులను ఆకర్షించేందుకు 50% భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు నమ్మిస్తున్నారు. కాఫీ డేట్ కోసం రూ.499 నుండి, రోజంతా తోడుగా ఉండేందుకు రూ.4,499 వరకు రకరకాల ప్యాకేజీల ధరలను వీరు ఎరగా వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

మోసం జరిగేది ఇలాగే:

నకిలీ ప్రొఫైల్స్: ప్రకటనలలో వాడే అందమైన అబ్బాయిల ఫోటోలు నిజమైనవి కావు. ఇవి AI ద్వారా సృష్టించినవి లేదా ఇంటర్నెట్ నుండి దొంగిలించినవి.

ఫీజుల పేరిట దోపిడీ: ఈ ప్రకటనలను నమ్మి చాటింగ్ చేసే యువతుల నుండి బుకింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో ఆన్‌లైన్‌లో వేలాది రూపాయలు వసూలు చేస్తారు.

ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్: డబ్బు చేతికి అందగానే అకౌంట్లను బ్లాక్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చాటింగ్‌లో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా బాధితులను బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేసే ప్రమాదం కూడా ఉంది.

పోలీసుల కీలక సూచనలు:

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి నకిలీ ప్రమోషనల్ ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు.

అపరిచితులతో ఆన్‌లైన్ పరిచయాలు, వ్యక్తిగత ఫోటోలు పంచుకోవడం వల్ల శారీరక, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలి.

బాధితులు ఏం చేయాలి?

ఎవరైనా ఇలాంటి డేటింగ్ మోసాల బారినపడి డబ్బులు నష్టపోతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా

https://cybercrime(dot)gov(dot)inపోర్టల్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >