Posted on 2024-07-20 10:27:44
షాద్ నగర్ నుండి అరుణాచల యాత్ర బస్సును ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అరుణాచలేశ్వరాలయం కార్తీక దీపాత్సవానికి పెట్టింది పేరనీ, చిదంబరాన్ని దర్శించినా, కాశీలో మరణించినా, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుందనీ అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పక అరుణాచల శివ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) తొలిసారి తొలి ఏకాదశి గురుపౌర్ణమి సందర్భంగా షాద్ నగర్ డిపో నుంచి అరుణాచల తీర్థ యాత్ర బస్సును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. అరుణాచల శివుడి యాత్రకు తన చేతిలో మీదుగా బస్సును ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. అరుణాచల యాత్ర శివయ్య కోసం బస్సును ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే అన్నారు. తను శివ భక్తుడినని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ఈ యాత్రలో భాగంగా రేపు ఉదయానికి కాణిపాకం దేవాలయానికి చేరుకుంటుందని, అక్కడ దర్శనం అనంతరం ఆర్టిసి ప్రయాణికులను గోల్డెన్ టెంపుల్ సందర్శిస్తుందని తెలిపారు. ఆ మరుసటి రోజు 21వ తేదీన అరుణాచలం శివుడిని దర్శించుకోవచ్చని ఎమ్మెల్యే శంకర్ తెలియజేశారు. మళ్లీ 22వ తేదీన స్థానిక డిపోకు ప్రయాణికులు భక్తులు చేరుకోవచ్చు అని తెలిపారు. ఆర్టీసీ ద్వారా తొలిసారి ఈ సర్వీస్ ను ప్రారంభించి ఈ మూడు రోజుల యాత్రకు కేవలం పెద్దలకు 3690 టికెట్టు ధర ఉంటుందని అదేవిధంగా పిల్లలకు 2400 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని ఇతర సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ సిబ్బందికి ఎమ్మెల్యే శంకర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆర్టీసీ డిపో మేనేజర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >