Posted on 2024-09-07 14:52:06
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంతో పాటు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే నా ముందున్న అతిపెద్ద సవాల్ అని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తన నియామకానికి సహకరించిన అధిష్టానానికి, రాష్ట్ర పార్టీ నేతలందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఇందుకు తన నియామకమే నిదర్శనమన్నారు. పీసీసీ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారని వారందరూ ఆ పదవికి అర్హులే అయినప్పటికీ వివిధ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం తనకు అవకాశం కల్పించిందని భావిస్తున్నానన్నారు.
ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మహేశ్‌కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన నియామకానికి సహకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి పూజలో మహేశ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన మహేశ్‌కుమార్ గౌడ్.. పీసీసీ పదవి విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన అధివ్ణానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి కోసం పోటీ పడిన వారితో కలిసి పని చేస్తానన్నారు. ఈ పదేళ్ల పాటు పార్టీనే నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానన్నారు.
రెండు మూడు రోజుల్లో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా ఉంటూ రాష్ట్రంలో పాట్ట బలోపేతానికి కృషి చేస్తానన్నారు. త్వరలోనే కమిటీలను నియమిస్తామని, పార్టి పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. కాగా, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సైతం సీఎంను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >