Posted on 2024-09-07 20:27:52
హిందూ సాంప్రదాయ పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాల మహానాడు జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని విగ్రహ దాత మంద పుల్లయ్య దంపతులు అన్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ, పాటిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలనుమెరుగుపర్చాలన్నారు. ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారత దేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేశాలకు దూరంగా ఉంటారని తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ఉత్సవ కమిటీలు భారీ మొత్తాన్ని వెచ్చించి ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సాంప్రదాయమని, ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించి పలువురికి ఆదర్శంగా నిలవాలని, పోలీసు, రెవిన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు మండలం మాల మహానాడు కమిటీ సభ్యులు మరియు యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >