Posted on 2024-09-13 18:42:47
డైలీ భారత్, చండ్రుగొండ: చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా నాలుగో తరగతి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఎర్రగుంట హై స్కూల్ కు బదిలీపై వెళ్తున్న కుసుమరాజు విజయ్ కుమార్ ను శుక్రవారం చండ్రుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో పూల బొకే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సుదీర్ఘకాలం పనిచేసిన విజయ్ కుమార్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దల మన్ననలను అందుకోవటం జరిగిందన్నారు. ఒకానొక సమయంలో తల్లిదండ్రులు కూడా స్కూల్లో విజయ్ ఉన్నాడు. ఏ సమాచారమైన మాకు తెలుస్తుంది అన్న ధీమాతో ఉండేవారని అలాంటి ఉద్యోగి బదిలీలపై వెళ్ళటం ఒకందుకు బాధ కలిగించిన ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం అన్నారు. రాబోయే రోజుల్లో ఉన్నతాధికారుల మన్నలను పొంది ఉన్నత శిఖరాల ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సూర వెంకటేశ్వర్లు, మండల నాయకులు భూపతి రమేష్, మల్లెం వెంకటేశ్వర్లు, బాబురావు, చోటు, షబ్బీర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాజిద్ తదితరులు పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >