Posted on 2025-05-05 18:59:11
నిమ్స్ లో చెంగలి నరసింహారావును పరామర్శించిన ఎంపీ
వద్దిరాజు చొరవతో ఆపరేషన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త, దళిత నాయకుడు చెంగలి నరసింహారావు గత కొంతకాలంగా మెదడులో కణితి తో బాధపడుచు ఉండడంతో. ఈ విషయమై నర్సింహారావు కుటుంబ సభ్యులు, స్థానిక బి ఆర్ఎస్ నాయకులు బి ఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ ,రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లగా. ఆయన తక్షణమే స్పందించి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో మాట్లాడి తక్షణ వైద్యం అందించాల్సిందిగా కోరారు. ఆయన సూచన వెంటనే మేరకు ఆపరేషన్ నిర్వహించి కనితిని తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న నరసింహారావును సోమవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. వెంట ఉన్న నరసింహారావు సతీమణి నాగమణి, కుమార్తె నాగ శైలు లను ధైర్యంగా ఉండాలని బోధిస్తున్న వారిని ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్లకు సూచించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అయ్యేంతవరకు అవసరమైన సహకారం అందిస్తానని రవిచంద్ర తెలిపారు. ఆయన వెంట సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉస రఘు, ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దిండిగల రాజేందర్, వైరా నియోజకవర్గ బి ఆర్ఎస్ నాయకులు లాకావతు గిరిబాబు, సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి ఉన్నారు.
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >