Posted on 2025-05-31 06:43:48
మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య?
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. యశోద ఆసుపత్రి వెనకాల ఉన్న ప్రాంతంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడి, ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు.
ఈ ఘటనలో ఒక యువకు డు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ అనే యువకుడి తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్ను స్నేహితులతో కలిసి జరుపు కోవాలని భావించాడు స్నేహితులతో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటుం డగా....
ఆ దారిలోనే వస్తున్న నలుగురు దుండగులు వారి దగ్గరికి వెళ్లి మద్యంతో పాటు..బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారు ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన దుండ గులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహి తంగా దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్ గౌడ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో, అతన్ని వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >