| Daily భారత్
Logo




స్టిక్కర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సలీమా

News

Posted on 2025-06-13 21:58:48

Share: Share


స్టిక్కర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సలీమా

జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సలీమా

డైలీ భారత్, జగిత్యాల: స్టిక్కర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దుచేసి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సలీమా, జిల్లా బాధ్యుడు రఘు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా. జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభ నిర్వహించారు. రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల  జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ధ్వజమెత్తారు.   జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని,  కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని, స్టిక్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి బిక్షపతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఇతర సంఘాల నుంచి పెద్దఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు.

నూతన కార్యవర్గం ఏర్పాటు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా బెజ్జంకి కరుణాకర్ రావు, కార్యదర్శి తరాల అతిక్, కోశాధికారి మంచాల ఓదెలు, ఉపాధ్యక్షులు చిలివేరి లక్ష్మీరాజ్యం, అల్లాకొండ సుధాకర్, సహాయ కార్యదర్శి ఉప్పులేటి నరేష్, ఎండి అప్సర్, కమిటీ సభ్యులు మామిడి ఆంజనేయులు, రఘుపతి రెడ్డి, సతీష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెడమల్ల రాజలింగం, కుసనపెల్లి రాజేందర్, జాతీయ కౌన్సిలింగ్ సభ్యులు సోమ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >