Posted on 2025-06-21 10:56:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమని, కోర్టుకు హాజరై జరిమానా చెల్లించాలని పోలీసులు సూచించారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరుకు గోపి(25) ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతుండడంతో పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల మద్యం తాగి బండి నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఈ నెల 19న పోలీసులు అతనికి ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాలని సూచించారు.
సమయానికి గోపి రాకపోవడంతో పోలీసులు మరోసారి ఫోన్ చేశారు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన గోపి తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వచ్చి.. దూలానికి ఉరేసుకుని చనిపోయాడు. కాగా, తన భర్త మరణానికి ట్రాఫిక్ పోలీసులే కారణమని గోపి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >