Posted on 2025-06-24 07:00:12
డైలీ భారత్, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ విషయం తెలిసి, మందలించడంతో ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది ఆ కుమార్తె. NLB నగర్ లో అర్థరాత్రి హత్య జరిగింది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్ లో సట్ల అంజలి(39), తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక(16) టెన్త్ క్లాస్ చదువుతోంది. పగిల్ల శివ(19)తో బాలికకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరచుగా అతడితో మాట్లాడుతున్న గుర్తించిన తల్లి అంజలి కూతుర్ని మందలించింది. అతడ్ని కలవొద్దు అని, ప్రేమ వ్యవహారం లాంటి వాటి జోలికి వెళ్లొద్దని బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. దాంతో ఇక ప్రియుడ్ని కలుస్తానో లేదో, అతడు దూరం అవుతాడని భావించి కన్నతల్లి హత్యకు ప్లాన్ చేసింది.
పేగు బంధాన్ని మరిచిన కూతురు తన ప్రియుడు పగిల్ల శివ, అతడి సోదరుడు పగిల్ల యశ్వంత్(18) తో కలిసి తల్లిని హత్య చేయాలని డిసైడ్ అయింది. సోమవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి గొంతు నులిమి, ఆపై తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలికను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు చెబుతుందన్న కారణంగానే తల్లి హత్యకు ప్లాన్ చేసి చంపేసిందని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.
#jeedimetla #medchal
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >