| Daily భారత్
Logo




గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

News

Posted on 2025-06-24 13:25:01

Share: Share


గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

4 ఇంక్లైన్ గ్రామపంచాయతీ సెక్యూరిటీకి వినతి పత్రం

బిఆర్ఎస్ 4 ఇంక్లైన్ ఇన్చార్జి బానోత్ రాము నాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

డైలీ భారత్, కొత్తగూడెం: రేగా కాంతారావు ఆదేశానుసారం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు  నాయకత్వంలో చుంచుపల్లి మండలం   4 ఇంక్లైన్ బిఆర్ఎస్  ఇంచార్జ్  బానోత్ రాము నాయక్ ఆధ్వర్యంలో4 ఇంక్లైన్  పంచాయతీ కార్యదర్శి నర్మదకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని పరిష్కరించాలని బానోత్ రాము నాయక్  డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి మంజూరు చేయాలని, సైడు కాలవలో చెత్తా చెదారం పిచ్చిమొక్కలు వెంటనే తొలగించి బ్లీచింగ్ పౌడరు చల్లించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగె మంచినీటి బావులు నీటి నిల్వ ఉన్నచోట తక్షణమే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, వీదిలైట్లు వెంటనే వేయించాలని, ఇండ్లలో చెత్తను ప్రతి రోజు సేకరించి డంపుయార్డుకు తరలించాలని డిమాండ్ చేశారు.

దోమల నివారణకు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని, పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాలలో పేరుకు పోయిన అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక పాలనను గాలికి వదిలేసిందని వ్యాఖ్యానించారు. అబద్దాలతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నున్నవత్ వస్య, నున్నవత్ తార, నున్నావత్ వెంకటేష్, భుక్య ధనరాజ బానోత్  నందు, బానోత్  పండు, సురేష్, రామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >