Posted on 2025-07-03 16:20:47
ప్రభుత్వం ఇచ్చిన పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళం వేసిన అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్దిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్దిదారులు ఆందోళనకు దిగారు.తామంతా ఇళ్లలో ఉంటున్నామని అధికారులకు వివరించిన, వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇళ్లకు తాళాలు వేయడంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఇంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు.బీజేపీ నాయకుల పరామర్శవిషయం తెలుసుకున్న బీజేపీనాయకులులక్ష్మీనారాయణ, గంగారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లను అధికారులు మళ్లీ లాక్కోవడం హేయమైనచర్యగా అభివర్ణించారు. తక్షణమే అధికారులు లబ్దిదారుల ఇళ్లను అప్పగించాలని కోరారు.
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >