| Daily భారత్
Logo




మహిళపై నకిలీ కొరియర్‌ బాయ్‌ అత్యాచారం

News

Posted on 2025-07-03 18:16:45

Share: Share


మహిళపై నకిలీ కొరియర్‌ బాయ్‌ అత్యాచారం

డైలీ భారత్, పూణే: ఒక వ్యక్తి కొరియర్‌ బాయ్‌ పేరుతో ఒక ఇంటి వద్దకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళపై ఏదో స్ప్రే చేశాడు. స్పృహకోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, మళ్లీ వస్తానంటూ మెసేజ్‌ ద్వారా ఆ మహిళను బెదిరించాడు.

ఒక వ్యక్తి కొరియర్‌ బాయ్‌ పేరుతో ఒక ఇంటి వద్దకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళపై ఏదో స్ప్రే చేశాడు. స్పృహకోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, మళ్లీ వస్తానంటూ మెసేజ్‌ ద్వారా ఆ మహిళను బెదిరించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక వ్యక్తి కొరియర్‌ బాయ్‌ పేరుతో కోంధ్వాలోని ఉన్నతస్థాయి వ్యక్తులు నివసించే హౌసింగ్‌ సొసైటీలోకి ప్రవేశించాడు. సోదరుడు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతి ఫ్లాట్‌ వద్దకు వెళ్లి బెల్‌ నొక్కాడు.

కాగా, డోర్‌ తీసిన మహిళకు ఆమె బ్యాంకు నుంచి కొరియర్‌ వచ్చిందని ఆ వ్యక్తి తెలిపాడు. సంతకం చేయాలని చెప్పాడు. ఆమె పెన్‌ అడగ్గా తన వద్ద లేదన్నాడు. దీంతో పెన్‌ కోసం ఆ యువతి  బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి మెయిన్‌ డోర్‌ లాక్‌ చేశాడు. ఆ మహిళపై ఏదో స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, మళ్లీ వస్తానంటూ మెసేజ్‌ ద్వారా బెదిరించాడు.

మరోవైపు బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. తన మొబైల్‌లో ఆ వ్యక్తితో సెల్ఫీ, బెదిరింపు సందేశాన్ని చూసింది. తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించింది.

కాగా, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. నిందితుడ్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడి అరెస్ట్‌ కోసం పది పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.


#fake #fake courier boy #pune

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >