| Daily భారత్
Logo




అయ్యా సీఎం సార్ మా గిరిజన గ్రామాలను పట్టించుకోండి

News

Posted on 2025-07-07 08:25:44

Share: Share


అయ్యా సీఎం సార్ మా గిరిజన గ్రామాలను పట్టించుకోండి

ITDA పీవో మాట ఇచ్చారు.. మరిచారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్ధులు...

సుమారు 70 మంది విద్యార్థులకు స్కూలు ఏర్పాటు చేయలేని దుస్థితి లో మన జిల్లా యంత్రాంగం..

గిరిజన మినిస్టర్ మాకు స్కూలు కట్టించండి అంటూ వెండుకోలు..

శ్రీరామ్ పురం ఎస్ టి కాలనీ కి రోడ్డు లేక గిరిజన విద్యార్థుల అవస్థలు...

గిరిజన సంఘాలు నాయకులకు పట్టింపులేదా..? అంటున్న గిరిజన విద్యార్థులు ...?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలో గల శ్రీరాంపురం ఎస్టి కాలనీ విద్యార్థుల ఆవేదన మాకు స్కూలు కట్టించండి సార్ అంటున్న గిరిజన విద్యార్థులు.

అయ్యా సీఎం సార్ మా గిరిజన గ్రామాలను పట్టించుకోండి మా పిల్లల భవిష్యత్తును మార్చండి అంటూ వేడుకుంటున్న శ్రీరాంపురం ఎస్టి కాలనీ గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు.

శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి రోడ్డు లేక గిరిజన బిడ్డలు విద్యార్థుల అవస్థలు మాకు రోడ్డు వేయండి స్కూలు కట్టించండి అంటూ గిరిజన బిడ్డలు విద్యార్థులు అధికారులను నాయకులను గిరిజన సంఘాలను వేడుకుంటున్నారు. 

మా గిరిజన సంఘాలు నాయకులు ఎక్కడ అంటూ గిరిజన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు మా ఊరు సమస్య తీర్చమని ఎన్నో ఏళ్ల తరబడి అధికారులను నాయకులను వేడుకుంటున్నా గాని ఏ ఒక్కరూ మా ఊరుని గాని మా సమస్యలు తీర్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన బిడ్డలు. 

వర్షాకాలం వచ్చింది అంటే చాలు అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్ కి వెళ్లాలన్న సరైన రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్నాము అలాగే మా పిల్లల కు స్కూల్ లేక మా పిల్లలు నిరక్షరాశులుగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మాలో కొంతమంది ధైర్యం చేసి దూరం స్కూలుకు పంపిస్తే సరైన రోడ్డు మార్గం లేక ఆ బురదలో సుమారు రెండు కిలోమీటర్లు కింద పడుతూ దెబ్బలు తగిలించుకుంటూ స్కూలుకు ఒక రోజు వెళితే రెండు రోజులు ఇంటికాడ  ఉంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీరాంపురం ఎస్ టి కాలనీ గిరిజనలు.

దయచేసి పెద్ద నాయకులు అధికారులు మా గ్రామానికి అన్ని వసతులు కల్పించగలరని వేడుకొంటున్న గిరిజన బిడ్డలు...

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >