Posted on 2025-07-25 13:49:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, బి ఎన్ ఆర్ కె ఎస్, టి ఎఫ్ టి యు ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 28న భవన నిర్మాణరంగా 14 రంగాల కార్మికుల న్యాయమైన హక్కుల కోసం చలో సిద్దిపేట్ సభను నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించే సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 రంగాల భవన నిర్మాణరంగ కార్మికులు ఆరోజున పనులు మానివేసి మన న్యాయమైన హక్కులు ఆ సభ ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. అక్కడ జరిగే సభకు రాష్ట్ర గనుల శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు ఇతర మంత్రులు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం హాజరుకానున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి భవన నిర్మాణరంగ కార్మికులు 14రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని కావున మన జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్దామని ఆయన అన్నారు. గృహ నిర్మాణ రంగం అధ్యక్షుడు పెంచాల వేణు, సెక్రెటరీ ఎస్.కె అరీఫ్, కోశాధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >