| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లా సింగారంలో భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు

News

Posted on 2025-07-26 16:13:58

Share: Share


మహబూబాబాద్ జిల్లా సింగారంలో భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: దేశ ప్రజలందరూ గర్వించదగ్గ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అని,ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అంబేద్కర్ అందరివాడు అని,ఆయన ఒక కులానికో,వర్గానికో పరిమితం కాదని,మహా నాయకుడని  కొనియాడారు.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రవిచంద్ర మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య,మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ,శంకర్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులతో కలిసి శనివారం ఆవిష్కరించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి,పూలుజల్లి, కొబ్బరికాయలు కొట్టారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,మా స్వగ్రామం ఇనుగుర్తిలో నెలకొల్పిన మహనీయులు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గత నెల 3వతేదీన,ఇప్పుడిక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలుగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడైన అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా గొప్పగా అభివృద్ధి చేశారన్నారు.రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని  అద్భుతంగా నిర్మించి, దానికి భారతరత్న అంబేద్కర్ పేరు పెట్టారని, పార్లమెంట్ నూతన భవనానికి కూడా అదే నామకరణం చేయాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయానికి సమీపాన 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ నెలకొల్పి అంబేద్కర్ పట్ల తనకున్న గౌరవభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట 20లక్షల చొప్పున ఉచితంగా అందజేసి ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని ఎంపీ వద్దిరాజు వివరించారు.అంబేద్కర్, కేసీఆర్ ల కీర్తి ప్రతిష్టలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఎంపీ రవిచంద్ర వివరించారు.కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రైతుబంధు, ఎస్సీల అభ్యున్నతికి దళితబంధు పథకాలను ప్రవేశపెట్టారని  పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధును 12లక్షలకు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీనిచ్చి, అధికారంలోకి వచ్చాక పూర్తిగా రద్దు చేసిందన్నారు.అలవికాని 432 వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ అధికారం చేపట్టిందని,వాటిలో ఇప్పుడు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని ఎంపీ రవిచంద్ర అన్నారు.కామారెడ్డి జిల్లా లింగంపేటలో దళితుడైన బీఆర్ఎస్ నాయకుడు సాయిలును పోలీసులు కొడితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారింట్లో భోజనం చేసి కొండంత ధైర్యాన్నిచ్చారన్నారు.అధికారం అనేది శాశ్వతం కాదని, మూడేళ్లలో తిరిగి 

 బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేస్తూ..ఈ సత్యాన్ని కాంగ్రెస్ నాయకులు, అధికారులు,పోలీసులు గ్రహించి మసులుకోవడం మంచిదని ఎంపీ వద్దిరాజు హెచ్చరించారు.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు మహిళలు బొట్టు పెట్టి మంగళహారతులతో స్వాగతం పలికారు, గ్రామస్తులు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రవిచంద్ర, డాక్టర్ రాజయ్య,శంకర్ నాయక్, హరిప్రియ, రాజేందర్, మహబూబాబాద్ జిల్లా మాజీ జేడ్పీ ఛైర్ పర్సన్ ఆంగోతు బిందు,విగ్రహదాత గోపీ, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తాతా గణేష్ తదితరులు చేయిచేయి కలిపి ప్రజలకు అభివాదం చేశారు."జై తెలంగాణ జైజై తెలంగాణ","జై భీమ్ జైజై భీమ్","సాధిద్ధాం సాధిద్ధాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్ధాం","జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్","వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి"అనే నినాదాలు హోరెత్తాయి.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >